వేంసూరు మండల పరిధిలోని బీరాపల్లి గ్రామంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ భవాని ఆధ్వర్యంలో 20 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు శుక్రవారం చేసారు. చిన్నారులకు గ్రామానికి చెందిన చెవి వెంకటేశ్వరరావు పలకలు, బలపాలు విరాళంగా అందించారు. పాల్గొన్న సత్తుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఇన్ ఛార్జ్ సీడీపీఓ మెహ్రూనీసా బేగం చిన్నారులకు అక్షరాలు దిద్దించారు. చంద్రకళావతి, స్వాతి, సెకండ్ ఏఎన్ఎం మారేశ్వరి పాల్గొన్నారు.