వేంసూరు: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

2చూసినవారు
వేంసూరు: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
వేంసూరు మండలం భీమవరం, వేంసూరు మేజర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. సన్న రకం వడ్లకు క్వింటాకు రూ. 2,389, దొడ్డు రకం వడ్లకు క్వింటాకు రూ. 2,369 ధరతో పాటు ప్రభుత్వ బోనస్ రూ. 500 కూడా అందిస్తామని తెలిపారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్