వేంసూరు మండలం బీరాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చిన్నమల్లేల నాయకులగూడేనికి చెందిన కూలీ చిలకా రాములు పని ముగించుకుని కాలినడకన స్వగ్రామానికి వెళ్తుండగా, అడవి రామన్నపాలెంకు చెందిన జుంజునూరి గోపి బైకుపై వచ్చి అతడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. రాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.