కోతుల బెడదపై ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు

0చూసినవారు
కోతుల బెడదపై ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం అన్నారుగూడెం గ్రామస్తులు 25 ఏళ్లుగా తమను పీడిస్తున్న కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రజావాణిలో ఎండీఓకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. కోతులు ఇళ్లలోకి చొరబడి, ప్రజలను వెంటాడి గాయపరుస్తున్నాయని, పంటలను ధ్వంసం చేసి నష్టం కలిగిస్తున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎండీఓ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్