
తల్లాడ: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
తల్లాడ మండలంలోని మల్సూరండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) అనే యువకుడు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటి వద్ద పురుగుల మందు తాగి, ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.



































