
సత్తుపల్లి: నష్టపోయిన వారికి న్యాయం చేయాలి
సింగరేణి బాంబు బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన పేదలకు నష్టపరిహారం చెల్లించాలని, సత్తుపల్లిలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ద్వారకాపురి కాలనీ, విరాట్ నగర్, వెంగళరావు నగర్ వాసులతో కలిసి సోమవారం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన తెలిపారు.




































