భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న మహిళపై కత్తితో దాడి

1467చూసినవారు
భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న మహిళపై కత్తితో దాడి
శుక్రవారం మండల పరిధిలోని ఏదుళ్లచెరువులో భార్యాభర్తల గొడవను ఆపబోయిన చుక్కమ్మ అనే మహిళపై జంపన్న కత్తితో దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న జంపన్న తన భార్యతో గొడవ పడుతుండగా, చుక్కమ్మ వారించడంతో ఆగ్రహించి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చుక్కమ్మను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్