
కారేపల్లి: యువతిని వేధిస్తున్న ఆర్ఎంపీపై కేసు నమోదు
కారేపల్లి పోలీసులు శుక్రవారం నరేష్ అనే ఆర్ఎంపీపై కేసు నమోదు చేశారు. ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన నరేష్, కారేపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలో ఓ కుటుంబానికి వైద్యం చేసే క్రమంలో ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆపై యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించినట్లు యువతి తల్లి ఫిర్యాదుతో నరేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి. గోపి తెలిపారు.




































