విద్యుత్‌ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి

4చూసినవారు
విద్యుత్‌ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాలలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 9 నెలల చిన్నారి ఆవేద్, ఎర్త్ పిట్ స్టీల్ జాలిపై చేయి పెట్టడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రమేష్ వెంటనే చిన్నారికి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్