బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు

5చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు
వైరాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ, 1946లో జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్