వైరా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బోనాల సందడి

0చూసినవారు
ఖమ్మం జిల్లా వైరాలో గురువారం స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నివాసంలో బోనాల సందడి అంబరాన్నంటింది. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఆషాఢ మాస బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్