ఖమ్మం జిల్లా, వైరాలోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం రాత్రి కళావేదిక ఆధ్వర్యంలో శనివారం రచయిత చెరుకుమల్లి వెంకటేశ్వరరావు రచించిన “భక్తి గీతాలు రాగసాగరం” పుస్తకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ఆవిష్కరించారు. సంగీతం ద్వారా భగవంతుని ఆరాధించడమే భక్తి గీతాల ప్రధాన ఉద్దేశమని, తెలుగు సాహిత్యంలో ఎందరో మహానుభావులు కీర్తనల ద్వారా భక్తిరసాన్ని ప్రజలకు అందించారని ఆమె పేర్కొన్నారు. యూట్యూబ్ ద్వారా భక్తి గీతాలను ప్రజలకు చేరువ చేస్తున్న చెరుకుమల్లి వెంకటేశ్వరరావును ఆమె అభినందించారు.