వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మంగళవారం కొణిజర్ల మండలంలోని బస్వాపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన హేమశ్రీ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాముల వెంకటేశ్వర్లు, ఆర్. వి. , రావూరి సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.