కొనిజర్ల మండలంలో రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గుబ్బగుర్తి సబ్ స్టేషన్ పరిధిలో సుమారు 30 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయని డీఈ రమేష్ తెలిపారు. మేకలకుంటలో భూలక్ష్మి అనే మహిళ ఇంటి పైకప్పు లేచిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపై విరిగిపడిన చెట్లను సిబ్బందితో కలిసి అధికారులు రాత్రికి రాత్రే తొలగించి, అర్ధరాత్రి కల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.