వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోతో గోడ గడియారాల పంపిణీ

0చూసినవారు
వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోతో గోడ గడియారాల పంపిణీ
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 13వ వార్డులో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఫోటోతో ముద్రించిన గోడ గడియారాలను స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పువాళ్ళు దుర్గాప్రసాద్, మునిసిపల్ వైస్ చైర్మన్ ముళ్ళుపాటి సీతారాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జనవరి 2, 2026న జరిగింది.

సంబంధిత పోస్ట్