వైరాలో దుమ్ముతో ప్రయాణికుల అవస్థలు

2చూసినవారు
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు దుమ్ముతో నిండిపోయింది. ట్యాంకర్లు, లారీలు వేగంగా వెళ్లడంతో విపరీతమైన దుమ్ము లేస్తోంది. దీంతో బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు, స్కూల్ పిల్లలు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు, కంటి నొప్పులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై మట్టిని తొలగించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్