గ్రామ దీపికల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు లకావత్ గిరిబాబు డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ దీపికలకు మంగళవారం ఏన్కూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘీభావం తెలిపారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన చేపట్టిన దీపికలకు మద్దతుగా గిరిబాబు మాట్లాడుతూ, శ్రమ దోపిడీకి గురవుతున్న వారికి పనికి తగ్గ వేతనం అందించాలని కోరారు.