ఏన్కూరు: కక్షపూరిత రాజకీయాలు ఆపాలి

6చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఏన్కూరులో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతోందని వారు ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలు ఆపాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :