ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అప్పాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అప్పాయి గూడెం, తులిస్యా తండా, భీక్య తండా గ్రామాలలో గురువారం ఎంపీడీవో పద్మ స్వయంగా దరఖాస్తు దారుల వద్దకు వెళ్లి చేయూత పింఛన్ దరఖాస్తులను, వారి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దండు ప్రవీణ్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూత పింఛన్ దరఖాస్తులను ఎంపీడీవో పరిశీలించారని, అధికారులు అడిగే అర్హత పత్రాలను అందించి సహకరించాలని దరఖాస్తుదారులను కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణవేణి, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.