గన్నవరం: వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ

1చూసినవారు
గన్నవరం: వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ
బహుజన అభ్యుదయ సేవా సమితి, హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం వైరా మండలం గన్నవరం గ్రామంలో వృద్ధులకు కిరాణా సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ నాలుగేళ్లుగా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్, వృద్ధులు, వితంతువులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందిస్తున్నామన్నారు. త్వరలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షురాలు ఆదూరి మణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్స రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్