ఖమ్మం జిల్లా, వైరా మండలం గరికపాడు గ్రామపంచాయతీలో ‘నేనున్నా’ మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు మిఠాయిలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు అందజేశారు. వైద్యుల సహకారంతో విద్యార్థులకు వైద్య
పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్కిరెడ్డి నాగలక్ష్మి ప్రభాకర్ రెడ్డి, మండల వైద్యాధికారి శ్రీహర్ష, సొసైటీ అధ్యక్షురాలు మేరుగు మానస తదితరులు పాల్గొన్నారు.