
రేపటి నుంచి శబరిమలలో ప్రత్యేక పూజలు
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం మిథున మాస పూజల నిమిత్తం జూన్ 14 నుంచి భక్తుల దర్శనార్థం పునఃప్రారంభం కానుంది. తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో రేపు సాయంత్రం 5 గంటలకు మేళ్శాంతి ఈ.డి. ప్రసాద్ గర్భగుడి తలుపులు తెరిచి, దీపారాధన నిర్వహిస్తారు. ఈ నెలవారీ ప్రత్యేక పూజలు జూన్ 19 వరకు కొనసాగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం www.sabarimalaonline.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ వర్చువల్ క్యూ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. జూన్ 19వ తేదీ రాత్రి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం ఆలయం మూసివేయబడుతుంది.




