వైరా మున్సిపాలిటీ 2వ వార్డులో లబ్ధిదారు ఉప్పు రామకృష్ణకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఖమ్మం జిల్లా డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమంశుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారం అవుతోందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.