ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, కామేపల్లి మండలాలలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రైతులు ఆందోళన చెందుతుండగా, ఈ తాజా వర్షంతో పంటలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆగిపోతే కొంతమేర దిగుబడి సాధించుకోవచ్చని వారు ఆశిస్తున్నారు.