రేపు పల్లిపాడులో పల్లె దవాఖాన ప్రారంభోత్సవం

2546చూసినవారు
రేపు పల్లిపాడులో పల్లె దవాఖాన ప్రారంభోత్సవం
వైరాలోని పల్లిపాడులో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన శనివారం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ డా. కాపా చంద్రకళ, కమిషనర్ రామచందర్రావు, 16వ వార్డు కౌన్సిలర్ బలరామయ్య శుక్రవారం దవాఖానను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ దవాఖానను అందుబాటులోకి తెస్తున్నట్లు చైర్‌పర్సన్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్