వైరాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

5చూసినవారు
వైరాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
ఖమ్మం జిల్లా, వైరా పట్టణంలోని గండగల పాడు గ్రామంలో లబ్ధిదారుడు దుద్దుకురి సుమంత్ ఇంటి గృహప్రవేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారు కుటుంబాన్ని అభినందించారు. లబ్ధిదారుడు సుమంత్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇల్లు కల నెరవేరింది. మా కుటుంబానికి కొత్త జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికీ ఋణపడి ఉంటాము  అని తెలిపారు. ఈ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన గృహనిర్మాణ పథకం కింద మంజూరైంది.
Job Suitcase

Jobs near you