జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రచారం

1098చూసినవారు
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రచారం
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ శనివారం గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు సింగరేణి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాష్, నాయకులు గుగులోత్ భీముడు, బాణోత్ హీరాలాల్, మేదరి టోనీ, మేదరి రాజా తదితరులు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే, స్థానికులను కలిసి కాంగ్రెస్ కు మద్దతు కోరారు.

సంబంధిత పోస్ట్