కామేపల్లి మండలంలోని పాతలింగాల పెద్ద చెరువు వద్ద కాల్వలో చేపలు పట్టడానికి వెళ్లిన బానోత్ శ్రీను అనే యువకుడు వరద నీటిలో జారి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శ్రీనుకు ఈత రాదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.