రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాలని ఏఐయుకేఎస్ జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కామేపల్లి మండలం పండితాపురంలో ఆల్ ఇండియా డిమాండ్స్ డే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 9న నిర్వహించే ఆల్ ఇండియా డిమాండ్స్ డేని జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.