కామేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం లింగాల క్రాస్ రోడ్డులో 'అరైవ్ ఆలైవ్' కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, తలకు గాయాల నుంచి రక్షణ కల్పించేందుకు హెల్మెట్ ప్రాముఖ్యతను 'హెల్మెట్ ఆన్. లైఫ్ ఆన్' నినాదాలతో వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.