కామేపల్లి: ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి

65చూసినవారు
కామేపల్లి: ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి
ఆర్ఎంపీలు శక్తికి మించి చికిత్స చేయకుండా ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని DMHO డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. కామేపల్లి మండలంలోని జాస్తిపల్లి, రామకృష్ణాపురంల్లో మెడికల్ షాపులు, ఆర్ఎంపీ కేంద్రాలను గురువారం తనిఖీ చేయగా పలు చోట్ల బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స చేస్తుండటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఆరు మెడికల్ షాపులకు తాళాలు వేయించారు. డీఐఓ చందు నాయక్, డాక్టర్ శిరీష, ఉద్యోగులు సుధారాణి పాల్గొన్నారు.