మొంథా తుఫాను ప్రభావంతో మండలంలో పత్తి, మొక్కజొన్న, మిర్చి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, ఏఐయుకెఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి మండలం టేకులగూడెం, పోలంపల్లి, పేరేపల్లి, మాదారం గ్రామాలలో పంట నష్ట సర్వేలు నిర్వహించారు. అనంతరం సింగరేణి మండలం తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి సందీప్, తేజ నాయక్, రాకేష్, సక్రు తదితరులు పాల్గొన్నారు.