కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్, చీమలపాడు, భాగ్యనగర్ తండా విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్లలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వెంకన్న తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.