కారేపల్లి: చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

9చూసినవారు
కారేపల్లి: చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
కారేపల్లి మండలంలోని చీమలపాడులో డిసెంబర్ 31న జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను కారేపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బానోతు రాంబాబు, బానోతు నగేష్, భూక్యా వేణు అనే ముగ్గురు వ్యక్తులు ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 40వేల నగదు, రూ. 10వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం, నిందితులను కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్