ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం

0చూసినవారు
ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
ఖమ్మం కమిషనరేట్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సీపీ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించిన అధికారులను ఆయన కొనియాడారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను అభినందించారు. పదవీ విరమణ చేసిన అధికారులు ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వారి భావి జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్