కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపాన బోనకల్ బ్రాంచ్ కాల్వలో వెల్డర్ నల్లాని బద్రినాధ్ (38) మృతదేహం లభ్యమైంది. ఖమ్మం గోపాలపురం ఎల్బీ నగర్ లో నివాసముండే ఆయన, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రామచంద్రంపేటకు చెందినవారు. ఈ నెల 26 నుంచి కనిపించకుండా పోయిన బద్రినాధ్ మృతదేహం బుధవారం దొరికింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.