కొణిజర్ల మండలం పెద్దగోపతిలోని ఐకేపీ కేంద్రంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి మందనపు రామారావు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రంలో కాటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించకుండా, మిల్లులో క్వింటాల్‌కు 8 నుండి 10 కిలోల వరకు కట్టింగ్‌లు విధించి రైతులను అన్యాయం చేస్తున్నారని ఆయన వివరించారు.