ఖమ్మం జిల్లా, వైరా జాతీయ ప్రధాన రహదారి వంతెనపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల మండలం, గ్రామానికి చెందిన కూలీలు పనుల కోసం తల్లాడ వైపు వెళ్తుండగా, లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.