జన్నారం గ్రామంలో మహా అన్నదానం కార్యక్రమం

3చూసినవారు
జన్నారం గ్రామంలో మహా అన్నదానం కార్యక్రమం
ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం మహా అన్నదానం కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ బానోత్ మణి చిరంజీవి, బీసీ కాలనీ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ ఉత్సవాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, సమాజంలో ఐక్యత, సేవాభావం, పరస్పర సహకారం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలత, గణేష్ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్