ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో సోమవారం స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో వైరా లోని శాంతినగర్‌కు చెందిన మాడపాటి నరసింహారావు (35) తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.