వైరాలోని సాలె బంజర గ్రామంలో ఇంటింటికి తిరిగి జరుగుతున్న SIR ప్రక్రియను మండల సేవలాల్ సేన అధ్యక్షులు పరిశీలించారు. ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఓటరు పరిశీలన ప్రక్రియను విజయవంతం చేయాలని, ఏవైనా సందేహాలుంటే గ్రామ BLOలను సంప్రదించి సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉషారాణి, లకావత్ బాబురావు, ధరావతు వెంకన్న, బానోతు మోతిలాల్, జర్పుల శివ, బానోత్ నవీన్ పాల్గొన్నారు.