ఎమ్మెల్యే పరామర్శ: దాడి బాధితులకు అండగా ఉంటామని హామీ

1797చూసినవారు
ఎమ్మెల్యే పరామర్శ: దాడి బాధితులకు అండగా ఉంటామని హామీ
కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో ప్రత్యర్థుల దాడికి గురైన బండి వెంకన్న కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్