ఈ నెల 6న జరగనున్న తన పెద్ద కుమార్తె గాయత్రి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేసి వేడుకకు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.