ఖమ్మం జిల్లా, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సహచర ఎమ్మెల్యేలతో కలిసి సచివాలయంలో మంగళవారం టీజీ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అవసరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధిక నిధులు త్వరితగతిన కేటాయించాలని కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.