ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో బుధవారం రాత్రి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోని) ఆధ్వర్యంలో మండల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ముత్యాలమ్మ తల్లి బోనాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా మహిళలు, గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు,
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.