గిద్దెవారిగూడెంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు

3చూసినవారు
గిద్దెవారిగూడెంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గిద్దెవారి గూడెంలో బుధవారం శ్రావణమాసం సందర్భంగా ముత్యాలమ్మ తల్లి కి ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వీసాల వెంకటేశ్వరరావు , సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గ్రామస్తులతో కలసి, ముత్యాలమ్మ తల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఇంటి వద్ద వంటలు చేసుకుని, బోనాలు నెత్తిన పెట్టుకొని ముత్యాలమ్మ తల్లి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆ ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నామన్నారు. వీసాల ఛాయాదేవి తదితర మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్