ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నుతి సత్యనారాయణ వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలాజీ నాయక్, రాష్ట్ర మార్క్ ఫైడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.