కారేపల్లి మండల సీపీఐ పార్టీ కార్యదర్శిగా పాపినేని సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల సీపీఐ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా దర్శి, చెన్నమనేని భూషయ్య ఎన్నికయ్యారు. 17 మంది నూతన కమిటీ సభ్యులతో ఏర్పడిన కమిటీని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో ప్రజా సమస్యలతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కమిటి సభ్యులు తెలిపారు.