ఖమ్మం జిల్లా, వైరాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం గురువారం సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ప్రజల రక్షణ కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టాలని భూక్యా వీరభద్రం విజ్ఞప్తి చేశారు.