ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత
కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే
బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోందని పేర్కొన్నారు.